అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కళాశాలకు భూమిపూజ..
చిన్నచింతకుంట, ఆంధ్రప్రభ : పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలంలోని పల్లమర్రి, నెల్లికొండి గ్రామాల మధ్య ఎర్నలగుట్టలో రూ.40 కోట్ల నిధులతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కళాశాలకు తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాలు, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి భూమిపూజ చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి వివేక్ వెంకట్ స్వామి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. జానకి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, తహసీల్దార్ ఎల్లన్న, ఎంపీడీవో అనురాధ, సీఐ రామకృష్ణతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
