ఆలయ అన్నదానానికి రూ.లక్ష విరాళం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి చెందిన అమ్మవారి అన్నదాన విభాగానికి తాడిగడప కు చెందిన డీవీఎస్‌ సాయిరాం వారి కుటుంబ సభ్యులు రూ.1,00,000 విరాళాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అమ్మవారి అన్నదాన సేవకు తమ వంతు సహకారంగా ఈ విరాళాన్ని అందజేశారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదు అందజేశారు.