భక్తి భావంతోనే మనిషికి ప్రశాంతత..
- టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
ఆమనగల్లు, ఆంధ్రప్రభ : భక్తి భావంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు మున్సిపల్ పరిధిలోని చంద్రాయన్పల్లి తండాలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పర్యటించారు.
భూడియా బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక మండపం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన రాఘవేందర్ రెడ్డిని తండావాసులు, వినాయక మండపం అభివృద్ధి కమిటీ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు భక్తిభావంతో ముందుకు సాగి దైవానుగ్రహం పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, భక్తిభావంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.
గ్రామీణ యువతకు ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక మండపం అభివృద్ధి కమిటీ సభ్యులు రాగ్య నాయక్, రమేష్, గోపాల్ కుమార్, దేవరాజ్, జగదీష్, మల్లేష్, రవి, సక్రో, చంద్రు, రూప్ సింగ్, లాల్కోటి, గోపి తదితరులు పాల్గొన్నారు.
