పెద్ది స్వప్నను పరామర్శించిన బజ్జు తండా గ్రామస్థులు

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,దివంగత ప్రజానాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి పెద్ది స్వప్నను బజ్జు తండా గ్రామస్థులు ఆదివారం పరామర్శించారు. మాజీ సర్పంచ్ పద్మ తిరుపతి ఆధ్వర్యంలో ఆమెను కలిసి,పెద్ది సుదర్శన్‌రెడ్డి తమ ప్రాంతానికి చేసిన సేవలను, గ్రామ ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి అండగా నిలిచేవారని, ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్నిగుర్తుచేసుకున్నారు.

ఆయన మరణం ప్రజలకు తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పెద్ది స్వప్నకు ధైర్యం చెప్పి,కుటుంబానికి గ్రామస్థులంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో తేజావత్ భద్రు, లావుడియా రామ్‌సింగ్, జె. స్వామి, మాజీ ఉపసర్పంచ్ లత, ప్రస్తుత వార్డు సభ్యుడు ముంగాలి, అరుణ, బోడి, దస్లి, భారతి, ఈశ్వరి, బుల్లి, సరోజ, రజిత, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.