గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు

  • చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బొండా సిద్ధార్థ

పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్ద స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అజిత్‌సింగ్‌నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా నాయకుడు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గౌతు లచ్చన్న చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కార్యకర్తలు, నాయకులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌతు లచ్చన్న ప్రజా జీవితాన్ని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాలను నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిరియ జగదాంబ, రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ సింగం వెంకన్న, సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ఇప్పిలి రామ్మోహన్, పిరియ సోమేశ్వరరావు, బెజవాడ తిరుపతి గౌడ్, సర్వేపల్లి అమర్నాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.