చిలకలూరిపేట సీఐ రమేష్‌బాబుకు ఉత్తమ పోలీస్ అవార్డు

  • అభినందించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : ఉత్తమ పోలీస్ అవార్డును రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అందుకున్న చిలకలూరిపేట పట్టణ సీఐ పి. రమేష్‌బాబును నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అభినందించారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ రమేష్‌బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ సమక్షంలో ఉత్తమ పోలీస్ అవార్డు అందుకోవడం చిలకలూరిపేట పట్టణానికి గర్వకారణమని రావు సుబ్రహ్మణ్యం అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు సీఐ రమేష్‌బాబుకు ఈ పురస్కారం లభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులోనూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.