జపాన్ విద్యా పర్యటనకు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎంపిక
నడిగూడెం, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం. సాయి ఈశ్వరి జపాన్ విద్యా పర్యటనకు ఎంపికయ్యారు. జపాన్ దేశ విద్యావిధానాన్ని అధ్యయనం చేసి, అక్కడి అత్యుత్తమ విద్యా పద్ధతులు, నూతన బోధనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఆమెకు లభించింది. ఈ విదేశీ విద్యా పర్యటన ద్వారా జపాన్‌లో అమలవుతున్న ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధికి అన్వయించే అవకాశం లభించనుంది. ఎం. సాయి ఈశ్వరి జపాన్ విద్యా పర్యటనకు ఎంపిక కావడంపై పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జపాన్ విద్యావిధానంలోని ఉత్తమ అంశాలను అధ్యయనం చేసి, అక్కడి అనుభవాలను తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అమలు చేసేందుకు ఆమె అందించే విలువైన సూచనలు విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడంలో దోహదపడాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆకాంక్షించారు.
