శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం కంచడం గ్రామంలో జరుగుతున్న నూతన శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ వారి సతీమణి కాగిత శిరీష పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
