తెల్లవారుజామున రెండు బస్సులు ఢీ..
- ముగ్గురికి స్వల్ప గాయాలు
కోదాడ, ఆంధ్రప్రభ: మునగాల మండలం ఆకుపాముల వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సును, ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొంది.
ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో మొత్తం 63 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
