మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఉరవకొండ వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు అన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మండల వ్యవసాయ కార్యాలయం, ఉరవకొండ వ్యవసాయ డివిజన్ కార్యాలయం, ఉరవకొండ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నారాయణస్వామి, ఏఈవోలు భరత్‌రాజ్, రామన్న, ప్రియాంక, శిరీష్, వెంకటనారాయణ, జూనియర్ అసిస్టెంట్ వెంకటమ్మ, ఆత్మ సిబ్బంది కిన్నెర, అటెండర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.