ఘనంగా 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అరుణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, జాతీయ ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ వరప్రసాద్, ఆర్‌ఐ రామకృష్ణ, మండల రత్నాకర్ బాబు, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ అశ్వత్థ నారాయణ, వీఆర్వోలు పెన్నా ఓబులేసు, వెంకటనారాయణ, గోపాల్, కృష్ణకీర్తి, ఉల్లిగన్న, రాధమ్మ, సంధ్య, షేక్ షావలి, చంద్రకళ, అరుణ, లాల్ బాషా, హమీద, వీఆర్ఏలు పాల్గొన్నారు.

స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వెలిగొండ నరసింహులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, ఏవో శంకర్, డిప్యూటీ ఎంపీడీవో మహమ్మద్ రఫీ, సీనియర్ అసిస్టెంట్ రవి, ఎంఈవో ఈశ్వరప్ప, హరి, ఆదినారాయణ, సలీం భాష పాల్గొన్నారు. అదేవిధంగా ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో సీఐ మహానంది, ఎస్సై జనార్దన్ నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉరవకొండ ఐటీఐ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.