దేశభక్తి చాటిన రైతన్నలు

చిలమత్తూరు, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని కోడూరు పంచాయతీ ముద్దప్పపల్లి గ్రామానికి చెందిన రైతులు వినూత్నంగా దేశభక్తిని చాటారు. వేరుశనగ పంటలో కలుపు మొక్కలను తొలగించే పనుల్లో నిమగ్నమైన రైతులు తమ రెండు ఎద్దుల కొమ్మలకు జాతీయ జెండాలను కట్టి వ్యవసాయ పనులు చేపట్టారు. జాతీయ జెండాలతో అలంకరించిన ఎద్దులతో పొలంలో రైతులు వ్యవసాయ పనులు చేస్తున్న దృశ్యం ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని పల్లె జీవనంతో మేళవిస్తూ రైతులు ప్రదర్శించిన దేశభక్తిని గ్రామస్థులు అభినందించారు.