రేగొండలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ రేగొండ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా ఎగురవేశారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా భారతదేశంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల కల్పన, పేదల సంక్షేమం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలలో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. పేదలకు ఉచిత రేషన్, పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఉచిత గ్యాస్ కనెక్షన్లు వంటి పలు సంక్షేమ పథకాల ద్వారా వారి జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకొచ్చామని అన్నారు.
డిజిటల్ సేవలు, గ్రామీణ, జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వేలు, విమానాశ్రయాలు, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు వంటి రంగాల్లో దేశం అభివృద్ధి సాధించిందన్నారు. ‘‘సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్ – సబ్కా ప్రయాస్’’ స్ఫూర్తితో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజలందరూ బాధ్యతాయుత పౌరులుగా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి ప్రసాదరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోల్సాని తిరుపతిరావు, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాటికంటి రవికిరణ్, జిల్లా నాయకులు మేత్కుపల్లి బుచ్చిరెడ్డి, గన్రెడ్డి లింగారెడ్డి, ఎస్టీ మోర్చా నాయకుడు కూరాకుల మల్లయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గాలీఫ్, మండల ప్రధాన కార్యదర్శులు దయ్యాల కిరణ్, తూర్పాటి మల్లేష్, సామాజిక మాధ్యమాల కన్వీనర్ ఎర్ర రాకేష్‌రెడ్డి, మండల నాయకులు మేకల రవీందర్, రమణారెడ్డి, కౌడగాని రాకేష్, బూత్ అధ్యక్షుడు చల్ల విక్రమ్, పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
