అగ్ని ప్రమాద బాధితులకు చేయూత

మహాముత్తారం, ఆంధ్రప్రభ: కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ములుగుపల్లి గ్రామ ఉపసర్పంచ్ మండపు లచ్చమల్లు, ఆయన కుమారులు మోహన్, ప్రభాకర్ చాటిచెప్పారు. ఇటీవల గ్యాస్‌ పేలుడు, షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఇళ్లు కాలిపోయి నష్టపోయిన మూడు కుటుంబాలను పరామర్శించి నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం అందించారు.
బాధిత కుటుంబాలకు 25 కిలోల చొప్పున బియ్యం, రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.

అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు తమవంతు సాయం చేయడంతో స్థానికులు అభినందించారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థికంగా స్థోమత ఉన్నవారు ముందుకు వచ్చి సహకరిస్తే బాధిత కుటుంబాలకు మరింత భరోసా కలుగుతుందని పేర్కొన్నారు. మహాముత్తారం మండల పీఎస్‌ఎస్‌ చైర్మన్ సోమశాంత్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కనుకునూర్ భూపతి, రమేష్, చీకట్ల లింగయ్యగౌడ్, మాజీ సర్పంచ్ ఉడుముల లక్ష్మి, పొడెం స్రవంతి, ములుగుపల్లి మాజీ సర్పంచ్ దూలం మల్లయ్య, సమ్మక్క, భూతం మధుకర్ తదితరులు పాల్గొన్నారు.