చెన్నూరు సీఐ బన్సీలాల్కు ఉత్తమ సేవా పత్రం
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్ ఉత్తమ సేవలు అందించినందుకు గుర్తింపుగా ఉత్తమ సేవా పత్రాన్ని అందుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆయనకు ఉత్తమ సేవా పత్రాన్ని అందజేశారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ పోలీస్ శాఖకు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ ప్రశంసా పత్రాన్ని అందించినట్లు తెలిపారు.
