నవాబుపేటలో స్వాతంత్య్ర వేడుకలు

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ
వేడుకల్లో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు

నవాబుపేట, ఆంధ్రప్రభ : నవాబుపేట మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, తహసీల్దార్‌ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, స్థానిక పోలీస్‌ స్టేషన్‌, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీవో జయరాములు నాయక్‌, ఏఎంసీ చైర్మన్‌ హారలింగం, ఎంఈఓ నాగ్యానాయక్‌, ఎస్సై నరేందర్‌, ఆయా పార్టీల అధ్యక్షులు సురేష్‌, నర్సింలు, లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ శ్రీనయ్య, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పలుచోట్ల జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.