ఘనంగా సిరికొండ ప్రశాంత్ జన్మదిన వేడుకలు

  • చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ

గణపురం, ఆంధ్రప్రభ: శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి తనయుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ యువజన నాయకుడు సిరికొండ ప్రశాంత్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జన్మదినాన్ని పురస్కరించుకుని చిరు వ్యాపారులకు గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రశాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రత్న రవి, గంజి జన్నయ్య, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, పాసికంటి రామకృష్ణ, కట్ల శంకరయ్య, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.