పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శాలువాలతో ఘన సత్కారం
వేకువజామునే విధులు నిర్వహిస్తున్న కార్మికులకు అభినందనలు

చెన్నూర్‌, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మున్సిపల్‌ పరిధిలోని 10వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆటో డ్రైవర్లను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బీజేపీ కౌన్సిలర్‌ గర్రెపెల్లి శాంతారాణి, వెంకట్‌ నర్సయ్యలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ శాంతారాణి మాట్లాడుతూ కాలనీల్లో వేకువజామునే విధులకు హాజరై పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను గౌరవించుకోవడం అభినందనీయమన్నారు. వారి సేవలను గుర్తించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సన్మానించినట్లు తెలిపారు.