భీమవరంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ వంట్ల రమేష్
మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం
వేడుకల్లో పాల్గొన్న గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు
వేంసూరు, ఆంధ్రప్రభ : భీమవరం గ్రామంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ వంట్ల రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని అన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చైతన్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
