లచ్చన్నగూడెంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ
జెండాను ఆవిష్కరించిన ఉపసర్పంచ్ బెజ్జం కిషోర్
వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు
వేంసూరు, ఆంధ్రప్రభ : లచ్చన్నగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచులు గరికపాటి శ్రీనివాసరావు, పుచ్చకాయల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పర్సా కుటుంబరావు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పామర్తి లక్ష్మీ అశోక్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ బెజ్జం కిషోర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు నడ్డి గోపి, జొన్నలగడ్డ నాగరాజు, సాలి దుర్గ, నందికోలా లావణ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పురేటి శ్రీనివాసరావు, ప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పోతునూరి మహేష్, మహేశ్వరరావు, జగన్నాథం, ఉమ్మడి శివ, నాగరాజు కొప్పుల, రామకృష్ణ, అర్చపల్లి లింగారావు, ఆంజనేయులు, శ్రీనివాసరావు, వీరవెంకు చిన్నారి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
