కనకదుర్గమ్మను దర్శించుకున్న నటి శ్రీలీల…
ఇంద్రకీలాద్రిపై ఆలయ మర్యాదలతో స్వాగతం..
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ లీల
విజయవాడ, ఆగస్టు 15(ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రముఖ సినీ నటి శ్రీలీల శనివారం కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన శ్రీలీలకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీలీల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు శ్రీలీలకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం శ్రీలీల ఆలయ ప్రాంగణం నుంచి వెళ్లారు.
