ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
గట్టుప్పల, ఆంధ్రప్రభ : గట్టుప్పల మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాములు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో హిమబిందు, పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎస్‌ఐ సంపత్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నామని జగన్నాథం జాతీయ జెండాను ఎగురవేశారు. తేరటుపల్లిలో సర్పంచ్ సింగం వెంకటేశం, అంతంపేటలో సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం, వెల్మకన్నెలో సర్పంచ్ రావుల స్వప్న రమేష్, నామాపురంలో సర్పంచ్ భీమనపల్లి రామయ్య, శేరుగూడెంలో సర్పంచ్ పంకెర్ల ప్రభాకర్, కమ్మగూడెంలో సర్పంచ్ మెరుగు సాలమ్మ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
గట్టుప్పల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ అమృతాదేవి, గట్టుప్పల చేనేత సహకార సంఘంలో అధ్యక్షురాలు కర్నాటి వజ్రమ్మ వెంకటేశం, ధనలక్ష్మి చేనేత సహకార సంఘంలో అధ్యక్షుడు నామని శివరాం, దేవి చేనేత సహకార సంఘంలో అధ్యక్షుడు చేపూరి ధనుంజయ్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వీరమల్ల శ్రీశైలం జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, వివిధ కుల సంఘాల కార్యాలయాల్లో సంఘాల అధ్యక్షులు, యువజన సంఘాల్లో యూత్ అధ్యక్షులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
