ఉత్తమ సేవకునిగా రావెళ్ల ఉదయ్ కుమార్ కు ప్రశంసాపత్రం..

చల్లపల్లి – ఆంధ్రప్రభ : రావెళ్ల కృష్ణ సేవాసమితి ద్వారా విస్తృత సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ ఛైర్మన్ రావెళ్ల ఉదయ్ కుమార్ కు ఉత్తమ సేవకునిగా అవార్డు లభించింది. మచిలీపట్నం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జాయింట్ కలెక్టర్ పి.నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుల చేతులమీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. ట్రస్ట్ అధ్యక్షులు, డీసీ ఛైర్మన్ నిడమానూరు దిలీప్ కుమార్ కార్యక్రమంలో ఉన్నారు.