ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

గుడివాడ (ఆంధ్రప్రభ): కృష్ణా జిల్లా గుడివాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ రిజిస్ట్రార్‌ మధుసూదనరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లు, స్థానికులు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం సబ్‌ రిజిస్ట్రార్‌ మధుసూదనరావు, సిబ్బంది మిఠాయిలు పంపిణీ చేసి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.