కార్‌ స్టాండ్‌లో స్వాతంత్య్ర వేడుకలు..

  • జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంవీఐ అశోక్‌, శ్వేత
  • దేశభక్తి, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపు
  • కారు యజమానులు, డ్రైవర్ల భారీ పాల్గొనడం

కొత్తగూడెం టౌన్‌, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం బస్టాండ్‌ పరిధిలోని కార్‌ స్టాండ్‌లో కారు ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ అశోక్‌, శ్వేత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. కార్‌ స్టాండ్‌కు చెందిన కారు యజమానులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. కార్యక్రమం అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఒకరికొకరు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తి నినాదాలతో కార్‌ స్టాండ్‌ పరిసరాలు మార్మోగాయి.