ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
భీంగల్ రూరల్, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ముచ్కూర్ సొసైటీ ఆవరణలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ఇన్‌చార్జ్ చైర్మన్ బంగ్లా దేవేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. కార్యక్రమంలో సొసైటీ ఇన్‌చార్జ్ సభ్యులు, సొసైటీ పరిధిలోని వివిధ గ్రామాల రైతులు, యువకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
