డీఐజీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

కర్నూలు రూరల్ బ్యూరో (ఆంధ్రప్రభ): కర్నూలు రేంజ్ డీఐజీ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని, వారి స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవి, డీఐజీ కార్యాలయ మేనేజర్ రత్నప్రకాష్, సీఐ (లైజనింగ్ అధికారి) తిక్కస్వామి, డీఐజీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.