నరసరావుపేటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..
మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం పలికిన
జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో కన్వీనర్ పెంటేల బాలాజి
నరసరావుపేట (ఆంధ్రప్రభ) : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నిర్వహించిన శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణానికి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ మర్యాదలతో ఆయనను ఆహ్వానించారు.
పార్టీ బలోపతానికి కృషి…
ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని దిశా నిర్దేశం చేశారు. పెంటేల బాలాజి స్పందిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
