హాసన్పర్తి పీఎస్‌లో స్వాతంత్ర్య వేడుకలు
మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన సీఐ మహేందర్
కానిస్టేబుల్ ధనుంజయ్‌కు ఘన నివాళి..
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : హాసన్పర్తి పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టేషన్ సీఐ ఏ. మహేందర్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది సేవలు మరువలేనివని కొనియాడారు. ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ ధనుంజయ్ చిత్రపటానికి సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. అంకితభావంతో విధులు నిర్వహించిన తోటి ఉద్యోగి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని అధికారులు భరోసా ఇచ్చారు.
