కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మచిలీపట్నం (ఆంధ్రప్రభ): మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం. నవీన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కృష్ణా జిల్లా ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.