గాంధీ పార్కులో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

పార్కును సుందరంగా అభివృద్ధి చేస్తామని హామీ.. గాంధీ విగ్రహానికి ఘన నివాళులు

నాగర్‌కర్నూల్ (ఆంధ్రప్రభ): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సుమిత్ర, వైస్ చైర్మన్ రమేష్, రిటైర్డ్ వాటర్ చెన్నయ్య, వంకేశ్వరం చెన్నయ్య, మాజీ ఉప సర్పంచ్ సర్దార్ అలీ, కమిషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఆగస్టు నాటికి గాంధీ పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పార్కు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, వాచ్‌మెన్‌ను నియమించి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఆధునిక సదుపాయాలతో గాంధీ పార్కును అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.