సీజ్ వాహనాల వేలం

ప్రభుత్వానికి రూ.27,500 అదనపు ఆదాయం

నందికొట్కూర్, ఆంధ్రప్రభ: నంద్యాల ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన మూడు వాహనాలకు గురువారం బహిరంగ వేలం నిర్వహించారు.అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్. విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో వేలం పాటదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.38,000 మాత్రమే కాగా పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు రూ.65,500కు ఈ వాహనాలు అమ్ముడుపోయాయి.

దీంతో ప్రభుత్వానికి రూ.27,500 అదనపు ఆదాయం సమకూరింది.ఈ మొత్తంతో పాటు జి.ఎస్.టి కింద రూ.11,790 అదనంగా వసూలు చేశారు.మొత్తం రూ.77,290ను వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు.సీజ్ చేసిన వాహనాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేందుకు ఎప్పటికప్పుడు బహిరంగ వేలాలు నిర్వహిస్తున్నామని ఏఈఎస్ విజయకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.