బీజేపీ నాయకుల హర్ ఘర్ తిరంగా ర్యాలీ

పాయకాపురం, ఆంధ్రప్రభ: అజిత్ సింగ్ నగర్ మండలంలో మండల అధ్యక్షుడు గొట్టుముక్కల రమేష్ రాజు ఆధ్వర్యంలో పైపుల్ రోడ్ లోని కృష్ణవేణి స్కూల్ పిల్లలతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పిల్లలలో దేశభక్తి నింపాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఉండాలని నినాదాలతో ఈ కార్యక్రమం ర్యాలీగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపాల్ సాంబశివరావు, అనసూయ దేవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మువ్వల సుబ్బయ్య , జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మ దేవరత్నకుమారి, చైతన్య శర్మ, హేమంత్ జెన్, ఎస్ ఐ ఆర్ కన్వీనర్ నామి శెట్టి వెంకట్ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎన్ వి కే పద్మజ, జిల్లా సెక్రెటరీ స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.