రైతు కూలీలతో మమేకం

కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

గంపలగూడెం, ఆంధ్రప్రభ: గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలోని పొలాల్లో పనిచేస్తున్న రైతు కూలీలను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆప్యాయంగా పలకరించి వారితో మమేకమయ్యారు. పొలాల్లో పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కొంతసేపు వారితో మాట్లాడి వారి జీవన పరిస్థితులు, కూలి పనులకు సంబంధించిన సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరాలపై స్వయంగా ఆరా తీశారు.

క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. రైతు కూలీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని, శ్రమజీవుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.