పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి అండ: కాంగ్రెస్‌ నాయకులు

తాడ్వాయి, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌ గ్రామంలో శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మార్గదర్శకంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆడపిల్లల వివాహాలు పేద కుటుంబాలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ సొంటికే మల్లవ్వ, కాంగ్రెస్‌ మండల, గ్రామ నాయకులు ఆరాలి కిషన్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, జెలేందర్‌రెడ్డి, టి. మోహన్‌రెడ్డి, మోహన్‌గౌడ్‌, బీరయ్య, సీహెచ్‌. సాయిలు, సంజీవరెడ్డి, తిరుపతిరెడ్డి, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గైని రాజలింగం తదితరులు పాల్గొన్నారు.