హర్ ఘర్ తిరంగా విద్యార్థులు భారీ ర్యాలీ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా ఉరవకొండ పట్టణంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద అసిస్టెంట్ కలెక్టర్ సుయస్ కుమార్ ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ ఎంపీడీవో కార్యాలయం వద్ద నుండి టవర్ క్లాక్ వరకు కొనసాగింది. విద్యార్థులు జాతీయ జెండాను పట్టుకొని వందేమాతరం అంటూ దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అరుణ, సీఐ మహానంది, ఎంపీడీవో రవి ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవోలు సతీష్ కుమార్, మహమ్మద్ రఫీ, గ్రామ కార్యదర్శి సయ్యద్ షామీర్, ఎం ఈ వో -2 రమాదేవి, ఏపీవో సుజాత, ఏవో శంకర్, మండల స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ జయప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.