Polavaram-89-9-Percent : వరదలోనూ Andhra Prabha Top News
Polavaram-89-9-Percent : వరదలోనూ Andhra Prabha Top News
- పనులు ఆగలేదు
- ఇప్పటికి 89.9 శాతం పూర్తి
- ఎడమ కాల్ప పనులూ
- జోరుగా సాగుతున్నాయి
- పోలవరంపై అధికారులు వెల్లడి
- వేగం పెంచాలి
- సీఎం దిశానిర్దేశం
(ఆంధ్రప్రభ, అమరావతి)

Polavaram-89-9-Percent : గోదావరికి వరదలొచ్చినా పోలవరం పనులు ఆగలేదు. , శరవుగంగా పనులు జరుగుతున్నాయి. ఎడమ కాలువ పనులూ స్పీడ్ పెంచాం, అని జలవనరుల శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.ఏపీ సచివాలయంలో శుక్రవారం పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై సీఎం సమీక్ష జరిపారు.

లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగు నీటి సరఫరా, నిర్వహణా ప్రణాళిక, జలధార- జలహారతి కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో నిన్నటి వరకూ 89.9 శాతం మేర సివిల్ పనులను సూర్తి చేసినట్టు అధికారులు తెలిపాఉ. పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్టు జలవనరుల శాఖ వివరించింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్-1,గ్యాప్-2లో పనులను కూడా శరవేగంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. డ్యామ్ సైట్ వద్ద రోడ్ల లాంటి మౌలిక వసతుల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు సమీపంలోని గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల మనోబావాలను కాపాడే రీతిలో కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇటీవల కాలంలో 14 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాలు వచ్చినా పనులకు ఇబ్బంది లేకుండా కనసాగించినట్టు అధికారులు తెలిపారు.ఈ సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
