ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థినీ, విద్యార్థులకు ప్రభుత్వం అందించిన నోటు పుస్తకాలను ప్రిన్సిపాల్ జైపాల్‌రెడ్డి పంపిణీ చేశారు.
ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 12 నోటు పుస్తకాలను సరఫరా చేయగా, వాటిని కళాశాలలోని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థుల చదువుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి విద్యార్థినీ, విద్యార్థికి యూనిఫామ్ అందించే దిశగా కూడా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరి మెరుగైన విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధుకుమార్, వైష్ణవి, వెంకటేష్, గంగాధర్, గంగారాం, శ్రీహరి, మురళీకృష్ణ, ఆనంద్‌కిషోర్, స్వాతి, సుమతి, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
