లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జానకంపేట శివారులోని ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌గా చిలుక రవికుమార్‌తో పాటు ఆరుగురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు.

ఆలయ ఎక్స్‌ఆఫిషియో సభ్యులుగా అర్చకులు కొండమాచార్యులు కొనసాగనున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్‌ చిలుక రవికుమార్‌ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.