కోయ్యగురపాడులో దొంగ హల్ చల్
ఇంట్లోనే 12 కాసుల బంగారం చోరీ..
ఇంటి యజమాని అప్రమత్తం.. కిటికీ అద్దాలు పగలగొట్టి పరార్
ఉంగుటూరు, ఆంధ్రప్రభ: ఉంగుటూరు మండలం కోయ్యగురపాడులో ఓ దొంగ ఇంట్లోకి చొరబడి 12 కాసుల బంగారం చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కదలికలు గుర్తించిన యజమాని అప్రమత్తమై తలుపులకు గడియ వేసి స్థానికులను పిలిచేందుకు బయటకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన దొంగ మంచం కింద దాక్కున్నాడు. అనంతరం ఇంటి యజమాని బయటకు వెళ్లిన సమయంలో కిటికీ అద్దాలను పగలగొట్టి వాటి ద్వారా బయటకు వచ్చి పరారయ్యాడు. చోరీకి గురైన బంగారంలో నంతాడు, కడియం, ఉంగరం ఉన్నట్లు సమాచారం.

ఘటనపై శుక్రవారం ఉంగుటూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. చోరీ జరిగిన తీరుపై ఆరా తీస్తూ నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు.

