జోరుగా సాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

మోపిదేవి, ఆంధ్రప్రభ: మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే నని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. మోపిదేవి మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జోరుగా సాగుతుంది. గురువారం సాయంత్రం మోపిదేవి మండలం కే. కొత్తపాలెం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి రాగి రత్నగిరి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మండల కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు గ్రామ తెలుగుదేశం పార్టీ సెక్రెటరీ పడమట వెంకటేశ్వరరావు, బూత్ కన్వీనర్ కోక్కిలిగడ్డ ఏసోబు, మమ్మనేని సన్నీ, దుట్టా విజయ్, పూషడపు గంగాధర్, చందన అనిల్, గొర్రెపర్తి సత్యనారాయణ, ఆరంబాక ప్రవీణ్, నాగాయతిప్ప పిఎసిఎస్ అధ్యక్షులు బళ్లా సీతారాం ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ పుప్పాల యేసు, తదితరులు ఉన్నారు.