మచిలీపట్నం పోర్టు పనుల పరిశీలన

పనుల పురోగతిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆరా
పనుల వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచన

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గురువారం పరిశీలించారు. పోర్టు నిర్మాణంలో ఇప్పటివరకు ఎంత శాతం పనులు పూర్తయ్యాయి, ప్రస్తుతం పనుల పురోగతి ఏ స్థాయిలో ఉందనే వివరాలను నిర్మాణ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.

పోర్టు నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రత్యేక పట్టుదలతో ఉన్నారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి వెంట మార్కెట్‌యార్డు చైర్మన్ కుంచె నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా వెంకటప్రసాద్, గోపు సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.