సచిన్‌ సావంత్‌ను కలిసిన శ్రీనివాస్‌ గౌడ్‌

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, వరంగల్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పల్లె శ్రీనివాస్‌ గౌడ్‌ గురువారం హైదరాబాద్‌లో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి సచిన్‌ సావంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గత ఏడాది కాలంగా తన ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలు, చేపట్టిన కార్యకలాపాలకు సంబంధించిన సంపూర్ణ నివేదికను సచిన్‌ సావంత్‌కు శ్రీనివాస్‌ గౌడ్‌ సమర్పించారు. నివేదికను పరిశీలించిన సావంత్‌.. శ్రీనివాస్‌ గౌడ్‌ను అభినందించినట్లు తెలిపారు.