రైతుల సమస్యలను పరిష్కరించాలి..

  • ఎరువుల కోసం ప్రవేశపెట్టిన యాప్ ను రద్దు చేయాలి
  • డిండి ప్రాజెక్టు సర్వేను నిలిపివేయాలి
  • మున్సిపల్ స్థలాన్ని కాపాడాలి
  • రైతులకు మొక్కజొన్న డబ్బులు సక్రమంగా వేయాలి
  • బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొక్కజొన్న కొనుగోలు రైతులకు న్యాయంగా వచ్చే విధంగా వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. బోనస్ కూడా రైతులకు ఇవ్వడం లేదని బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా రైతులు ఎరువుల కొనుగోలులో ఇబ్బందులు పడుతున్నారని రైతుల కోసం ఏర్పాటు చేసిన యాపులను రద్దుచేసి నేరుగా ఎరువులను అందించాలని, నకిలీ డి ఏ పి ఎరువులను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రధానంగా డిండి ఎత్తిపోతల పథకాన్ని అమలు చేసేందుకు సర్వే చేస్తున్నారని దీనిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కే ఎల్ ఐ ప్రాజెక్టుకు భూములు ఇచ్చి నష్టపోయారని మళ్ళీ భూములు కోల్పోతారని దీనిని వ్యతిరేకిస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లో నీటిని తరలించేందుకు వీల్లేదని, కేలై కాల్వ ద్వారా రైతులకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో 33 లక్షల వ్యవసాయ సాగు భూమి ఉండగా కేవలం 9 లక్షల మాత్రమే సాగవుతున్నదని ముఖ్యమంత్రి ఈ జిల్లా వాడైన న్యాయం చేయడం లేదని వెంటనే జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

పక్క జిల్లా అయిన నలగొండ 12 లక్షల ఎకరాల భూమి ఉంటే 90 శాతం సాగవుతున్నదని ఆ విధమైన ప్రయత్నం ఈ జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పెన్షన్లలో ఒక తొక్కలు జరగకుండా అర్హులందరికీ ఇవ్వాలని పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని లక్కో అనుకుంటా నల్లాల బావి పూడ్చి వేశారని ఆ స్థలం ప్రభుత్వాన్ని దానిని కాపాడాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు బాలగౌడ్ అర్థం రవి లక్ష్మయ్య కౌన్సిలర్ అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు.