యూపీఎస్ పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ

దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : దస్తూరాబాద్ మండలం లోని రేవోజిపేట యూపి ఎస్ పాఠశాలలోనీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న షూలని గురువారం గ్రామ సర్పంచ్ వకోలా మహేష్, ప్రధానోపాధ్యాయులు మహేష్ ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందని, ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని కోరారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి శశిధర్, ఉపాధ్యాయులు మంజుల, తదితరులు ఉన్నారు.