చెన్నూరులో బీజేపీ తిరంగా ర్యాలీ..

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రతాప మారుతి హనుమాన్ టెంపుల్ నుంచి గాంధీ చౌక్ వరకు బీజేపీ నేతలు, విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని బీజేపీ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.