టెంకాయల విక్రయానికి బహిరంగ వేలం..

  • దేవాలయానికి పెరిగిన భారీ ఆదాయం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం దేవాదాయ శాఖ పర్యవేక్షణాది కారి అక్కిరెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ ధర్మ కర్తల మండలి ఛైర్మెన్ రేగటి నాగరాజు, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరం టెంకాయలు విక్రయించుకొను హక్కు మరియు కొబ్బరి చిప్పలు సేకరించుకొను హక్కులకు సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం వేసినట్లు దేవాలయ ఈవో సాకే రమేష్ బాబు తెలిపారు. ముందుగా టెంకాయలు విక్రయించుకొను హక్కు కు కార్యనిర్వహణాధికారి వేలం షరతులు చదవగా 14 మంది వేలం పాటదారులు డిపాజిట్ కట్టారు.

వేలంపాటలో 9 మంది పాటలో పాల్గొన్నారు. వేలం పాట హోరాహోరీగా కొనసాగింది. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన చెన్నకేశవులు టెంకాయలు విక్రయించుకొను హక్కుకు 45, 24, 000 రూపాయలకు వేలం పాట పాడి దక్కించుకున్నారు. సీల్డ్ టెండర్ లో టెంకాయలు విక్రయించుకొను హక్కు కు ఎవ్వరు టెండర్స్ వేయలేదు. కావున బహిరంగ వేలం పాటను హెచ్చు పాటగా ఖరారు చేశారు. సంవత్సరంలో పాట 24, 80, 000 రూపాయలు కంటే ప్రస్తుత పాట 20, 44, 000 రూపాయలు దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది.

కొబ్బరి చిప్పలు సేకరించుకొను హక్కుకు కార్యనిర్వహణాధికారి వేలం షరతులు చదవగా వేలం నందు పాట పాడుటకు 13 మంది డిపాజిట్ చెల్లించారు. అందులో 7 మంది పాటలో పాల్గొన్నారు. కొబ్బరి చిప్పలు సేకరించుకొను హక్కుకు పట్టణానికి చెందిన ప్రసాద్ 15,10, 000 రూపాయలకు వేలం పాట పాడి పాటను దక్కించుకున్నారు. గత సంవత్సరం పాట 6, 85, 000 కంటే ప్రస్తుత పాట 8, 25,000 రూపాయలు ఎక్కువగా ఉన్నందున పాట ఖరారు.

సీల్డ్ టెండర్ ద్వారా కొబ్బరి చిప్పలు సేకరించుకొను హక్కుకు 1 టెండర్ వచ్చినది. సీల్డ్ టెండర్, బహిరంగ వేలం రెండింటిలో బహిరంగ వేలం పాట ఎక్కువ ఉన్నందున బహిరంగ వేలం పాటను 15,10, 000 రూపాయలు పాటను ఖరారు చేశారు. గత సంవత్సరం కంటే ఈసారి దేవాలయానికి భారీగా ఆదాయం వచ్చినట్లు ఈవో సాకే రమేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోపిడి గోవిందు, ఇంద్రావతి సుధాకర్, ధర్మ కర్త ముష్టూరు రామక్రిష్ణ, ధర్మ కర్త బొల్లినేని పద్మాక్షి, బొల్లినేని ఓబులేష్, ధర్మకర్త ముష్టూరు ఎర్రి స్వామి, ధర్మ కర్త మంగళ చిన్న నారాయప్ప, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.