బ్యాంకు అనుసంధానం, స్త్రీనిధిపై సమీక్ష..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలోని ఐ కె పి కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశం లో జన్నారం, దండేపల్లి మండలాల సిబ్బందితో బ్యాంకు అనుసంధానమైన బ్యాంకు రుణాలు, స్త్రీనిధి అంశాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు మండలాలకు సంబంధించిన ఐ కె పి సిబ్బంది హాజరై బ్యాంకు అనుసంధానం లక్ష్యాల సాధన, స్త్రీనిధి రుణాల పురోగతిపై సమీక్షించారు. మండలాల వారీగా సాధించిన ప్రగతిని పరిశీలించి, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సహాయ ప్రాజెక్టు అధికారి అంజయ్య, బ్యాంకు అనుసంధాన జిల్లా ప్రాజెక్టు అధికారి వనజ, స్త్రీనిధి ప్రాంతీయ నిర్వాహకులు వెంకటరమణ, బ్యాంకు అనుసంధాన మండల ప్రాజెక్టు అధికారి రామచందర్, దండేపల్లి మండల ప్రాజెక్టు అధికారి లక్ష్మి, జన్నారం మండల ప్రాజెక్టు అధికారి లలితతో పాటు సమాజ సమన్వయకర్తలు పాల్గొన్నారు.