చిట్యాల గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డీపీఓ

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) శ్రీలత గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీకి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి, కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత, శానిటేషన్ గురించి పలు సూచనలు చేయడం, పంచాయతీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డు మెంబర్ తౌటం నవీన్, గ్రామపంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.