గొల్లపల్లిలో విచ్చలవిడిగా బియ్యం దందా…

  • స్టేషన్ ముందు నుంచి బియ్యం తరలింపు..
  • పోలీసులకు సవాల్ గా మారిన అక్రమ దందా

గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి మండలంలో విచ్చలవిడిగా రేషన్ బియ్యం దందా కొనసాగుతుంది. గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి జగిత్యాలకు తరలిస్తుంటారు. బియ్యం దందా చేసేది ముఖ్యంగా గుంజపడుగు గ్రామానికి చెందిన వారై ఉంటారు. ప్రతినెల ఊరురా తిరుగుతూ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి జగిత్యాలకు తరలించి అధిక ధరకు విక్రయిస్తుంటారు. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు కానీ అధికారులు కానీ పట్టించుకున్న పాపాల పోలేదని విమర్శలు ఉన్నాయి. పోలీసులు ఈ మధ్యకాలంలో గుంజపడుగు గ్రామంలో బియ్యాన్ని కొనుగోలు చేసే ఇళ్లన్నీ తనిఖీ చేసి హెచ్చరికలు తయారు చేశారు.

పోలీసుల హెచ్చరికలను కాదని స్టేషన్ ముందు నుంచే పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకొని జగిత్యాలకు తరలిస్తుండడం విశేషం. ప్రతినెల 5వ తారీఖు నుంచి 15వ తారీకు వరకు ఈ దందా కొనసాగుతుంది. మరి ఈ నెలలో మూడు నెలల రేషన్ బియ్యం ప్రభుత్వం పంపిణీ చేస్తుండగా బియ్యాన్ని తీసుకున్న వెంటనే విక్రయిస్తున్నారు. ఉచితంగా వచ్చే బియ్యానికి కిలో ఒక్కంటికే రూ.18 నుంచి రూ.20 ల వరకు విక్రయిస్తుంటారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని వెంటనే జగిత్యాలకు తరలిస్తుంటారు.